BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

BDL Job Vacancies
BDL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్‌లోని పలు ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, క్యూసీ మెకానికల్, కంట్రోల్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, వీఎల్‌ఎస్‌ఐ డిజైనర్, పీసీబీ డిజైనర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : జాగ్రత్త.. స్మార్ట్ ఫోన్ తో గుండె జబ్బులు, డయాబెటిస్
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఆఖరు తేదిగా 16 జులై 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bdl-india.in/ పరిశీలించగలరు.