BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

BEL Recruitment
BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఘజియాబాద్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Girl Challenge Viral : తుమ్మినపుడు కళ్లు మూయనని ఛాలెంజ్ చేసింది.. ఆ తరువాత ఏమైందంటే?
విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే హ్యూమన్ రిసోర్స్- 03, ఫైనాన్స్- 05, ఎలక్ట్రానిక్స్- 30, కంప్యూటర్ సైన్స్- 17,కంప్యూటర్ సైన్స్- 08, ఎలక్ట్రానిక్స్- 29, మెకానికల్- 03 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Job Vacancies : కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28-32 సంవత్సరాలు మధ్య ఉండాలి.రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజుగాను ట్రైనీ ఇంజినీర్/ ఆఫీసర్‌కు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.400.గా నిర్ణయించారు. అభ్యర్థులు సెప్టెంబరు 07 దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.