CBSE CTET Answer Key : త్వరలో సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!
CBSE CTET Answer Key 2024 : త్వరలో సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షకు ఆన్సర్ కీని విడుదల చేయనుంది. సీటెట్ ఆన్సర్ కీ సీటెట్ అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)లో అందుబాటులో ఉంటుంది.

CBSE CTET Answer Key 2024 To Be Release Soon
CBSE CTET Answer Key 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షకు ఆన్సర్ కీని విడుదల చేయనుంది. సీటెట్ ఆన్సర్ కీ సీటెట్ అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)లో అందుబాటులో ఉంటుంది. సీటెట్ ఆన్సర్ కీ విడుదలకు సంబంధించిన కచ్చితమైన తేదీ, సమయం ప్రకటించలేదు. సీటెట్ పరీక్ష డిసెంబర్ 14, 2024న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగింది.
పేపర్ II ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ I సాయంత్రం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. గత ట్రెండ్స్ ప్రకారం.. ఓఎంఆర్ ఆన్సర్ డాక్యుమెంట్లతో పాటు తాత్కాలిక సమాధానాల కీ త్వరలో విడుదల కానుంది. సీటెట్ అభ్యర్థులు సమాధానాలపై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఉంటుంది.
అభ్యంతరాలను తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ. 1000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇచ్చిన గడువులోపు సమర్పించిన చెల్లింపు అభ్యంతరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. చెల్లింపు లేకుండా లేదా ఇతర మార్గాల ద్వారా సమర్పించిన అభ్యంతరాలు అంగీకరించరు.
సబ్జెక్ట్ నిపుణులు అన్ని అభ్యంతరాలను సమీక్షించి ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా అభ్యంతరం ఆమోదిస్తే.. సీటెట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అభ్యర్థికి తిరిగి చెల్లిస్తారు.
సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 : డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
అభ్యర్థులు ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో సీటెట్ ఆన్సర్ కీ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- ప్రొవిజనల్ ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది.
- ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
ముఖ్యంగా, సీటెట్ ఫలితాలు 2024 జనవరి చివరి నాటికి రిలీజ్ కానున్నాయి. సీటెట్ 2024 స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పుట్టిన తేదీ, సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు, ర్యాంక్, ఇతర సంబంధిత వివరాలు ఉంటాయి. సీబీఎస్ఈ సీటెట్ 2024 గురించి మరింత సమాచారం కోసం దయచేసి (ctet.nic.in) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.