CBSE Term 2 Exams : ఏప్రిల్ 26 నుంచే CBSE టర్మ్ 2 ఎగ్జామ్స్.. ఆఫ్‌లైన్ మోడ్‌లోనే..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సీబీఎస్ఈ రెండవ టర్మ్ బోర్డ్ పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు బుధవారం (ఫిబ్రవరి 9) నోటిఫికేషన్ విడుదల చేసింది.

Cbse Term 2 Board Exams For
CBSE Term 2 Exams : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం (ఫిబ్రవరి 9)న సీబీఎస్ఈ రెండవ టర్మ్ బోర్డ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 26 నుంచి 10వ తరగతి, 12 తరగతులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
ఈ మేరకు బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భరద్వాజ్ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పాఠశాలలు ఫిజికల్ క్లాసులను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టర్మ్ 1 ఎగ్జామ్స్ నిర్వహించగా.. టర్మ్ 1 ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఈ ఫలితాలకు సంబంధించిన తేదీని ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు తమ పరీక్ష జవాబు పత్రాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చెకింగ్ చేసుకోవచ్చునని బోర్డు తెలిపింది. ఇప్పటికే మోడల్ క్వశ్చన్ పేపర్స్‌ను అధికారిక వెబ్‌సైట్లో విడుదల చేసినట్లు భరద్వాజ్ తెలిపారు.
ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి డేట్ షీట్ ను బోర్డ్ అధికారిక వెబ్ సైట్ www.cbse.nic.in వెబ్ సైట్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్లో విడుదల చేసిన వివరాలను మాత్రమే విశ్వసించాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలను ఆఫ్ లైన్ లోనే నిర్వహిస్తామని బోర్డు తెలిపింది.
ప్రశ్నపత్రం మోడల్ CBSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మోడల్ పేపర్ల మాదిరిగానే ఉంటుంది. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల నుంచే హాజరవుతారు. టర్మ్ 2 పరీక్ష తేదీ షీట్ త్వరలో విడుదల కానుంది. పూర్తి వివరాల కోసం విద్యార్థులు cbse.nic.inలో చూడవచ్చు. 2 టర్మ్‌లలో బోర్డు పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.
టర్మ్ 1 పరీక్షలు గతేడాది నవంబర్-డిసెంబర్‌లో జరిగాయి. 10వ తరగతికి సంబంధించిన టర్మ్ 1 పరీక్షలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11, 2021 వరకు నిర్వహించారు. 12వ తరగతి నుంచి టర్మ్ 1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22, 2021 వరకు నిర్వహించారు. CBSE టర్మ్ 2 పరీక్షల ప్రారంభ తేదీని ప్రకటించినప్పటికీ.. పూర్తి పరీక్షా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.
Read Also : Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!