CBI ZBO Recruitment 2025 : ఈ ‘సెంట్రల్ బ్యాంక్’లో జాబ్స్ పడ్డాయి.. 266 పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఇదిగో.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

CBI ZBO Recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ZBO రిక్రూట్‌మెంట్ 2025: అభ్యర్థులు జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు ఫిబ్రవరి 9 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CBI ZBO Recruitment 2025 : ఈ ‘సెంట్రల్ బ్యాంక్’లో జాబ్స్ పడ్డాయి.. 266 పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఇదిగో.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

CBI ZBO Recruitment 2025

Updated On : February 6, 2025 / 6:48 PM IST

CBI ZBO Recruitment 2025 : బ్యాంకు ఉద్యోగం కోసం చూస్తున్నారా? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబులు పడ్డాయి. జోన్ బేస్డ్ ఆఫీసర్ (ZBO) పోస్టుల నియామకానికి అధికారికంగా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు (centralbankofindia.co.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ZBO రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 9, 2025గా నిర్ణయించింది.

Read Also : Stories Of Deportees : లక్షలు పోసి అమెరికా పంపాం.. డబ్బు పోతే పోయింది.. కానీ, నా కొడుకు క్షేమంగా తిరిగి వచ్చాడంటూ తండ్రి భావోద్వేగం!

పోస్టుల వివరాలు :
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అనేక విభాగాల్లో మొత్తం 266 జోన్ ఆధారిత ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అహ్మదాబాద్: 123 పోస్టులు
చెన్నై: 58 పోస్టులు
గౌహతి: 43 పోస్టులు
హైదరాబాద్: 42 పోస్టులు

సీబీఐ ZBO రిక్రూట్‌మెంట్ 2025 అర్హత ప్రమాణాలివే :
ఆసక్తి గల అభ్యర్థులు ఈ కింది అర్హతలను తప్పక కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD)తో సహా సమానమైన అర్హత ఉండాలి. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.

వయోపరిమితి :
అభ్యర్థులు నవంబర్ 30, 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి (డిసెంబర్ 1, 1992 నుంచి నవంబర్ 30, 2003 మధ్య జన్మించాలి).

సీబీఐ ZBO దరఖాస్తు రుసుము :
SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు : రూ. 175 + జీఎస్టీ
మిగతా అభ్యర్థులందరూ: రూ. 850 + జీఎస్టీ
డెబిట్ కార్డులు (RuPay/Visa/MasterCard/Maestro), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు లేదా మొబైల్ వ్యాలెట్ల ద్వారా చేయవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ZBO రిక్రూట్‌మెంట్ 2025 ఎలా దరఖాస్తు చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్‌ (centralbankofindia.co.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, “Career With Us” ట్యాబ్ కింద ‘Current Vacancies’ పై క్లిక్ చేయండి.
  • “రెగ్యులర్ బేసిస్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ Iలో జోన్ బేస్డ్ ఆఫీసర్ నియామకం” కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
  • “Click here for New Registration” పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలను నింపండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.

జెడ్‌బీఓ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.

Read Also : Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

రాత పరీక్ష: ఈ పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 మార్కు విలువైనవి. 80 నిమిషాల్లో పూర్తి చేయాలి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం పరీక్ష తాత్కాలికంగా మార్చి 2025లో జరగనుంది.

ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూకు 30శాతం వెయిటేజీ ఉంటుంది. ఉమ్మడి రాత పరీక్ష, ఇంటర్వ్యూకు కలిపి 70:30 వెయిటేజీ ఉంటుంది.

ఆన్‌లైన్ పరీక్ష స్కోర్‌ల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ప్రతి జోన్, కేటగిరీకి ప్రత్యేక ర్యాంకింగ్‌లు ఉంటాయి. అభ్యర్థులు గడువుకు ముందే దరఖాస్తు చేసుకుని, రాబోయే ఎంపిక దశలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.