CISF Govt Jobs : పది పాసైతే చాలు.. కానిస్టేబుల్ జాబ్.. నెలకు జీతం రూ.69వేల వరకు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

CISF Govt Jobs : సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు పడ్డాయి. పది పాసైన వారికి అవకాశం. ఈ అర్హతలు కలిగి ఉండి రాత పరీక్షల మంచి ర్యాంకు సాధిస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి నెలకు రూ. 21వేల నుంచి రూ. 69వేల వరకు జీతం లభిస్తుంది.

CISF Govt Jobs : పది పాసైతే చాలు.. కానిస్టేబుల్ జాబ్.. నెలకు జీతం రూ.69వేల వరకు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

CISF Job Notification

Updated On : March 2, 2025 / 9:04 PM IST

CISF Govt Jobs : ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టుల రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. సీఐఎస్ఎఫ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించేవారికి ఇదే సరైన అవకాశం.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 1,161 పోస్టులను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 5 నుంచి ఏప్రిల్ 3 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఖాళీల వివరాలతో పాటు అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ, జీతం వంటి పూర్తి వివరాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.

ఖాళీల వివరాలివే :
సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ కేటగిరీ కింద మల్టీ ట్రేడ్‌ల కోసం నియామకాలు చేపడుతోంది. ఈ ఖాళీల వివరాలు కిందివిధంగా ఉన్నాయి.

  • కానిస్టేబుల్ కుక్ : 493
  • కానిస్టేబుల్ కోబ్లర్ : 09
  • కానిస్టేబుల్ టైలర్ : 23
  • కానిస్టేబుల్ బార్బర్ : 199
  • కానిస్టేబుల్ వాషర్‌మ్యాన్ : 262
  • కానిస్టేబుల్ స్వీపర్ : 152
  • కానిస్టేబుల్ పెయింటర్ : 02
  • కానిస్టేబుల్ కార్పెంటర్ : 09
  • కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ : 04
  • కానిస్టేబుల్ గార్డనర్ : 04
  • కానిస్టేబుల్ వెల్డర్ : 01
  • కానిస్టేబుల్ ఛార్జ్-మ్యాన్ (మెకానికల్) : 01
  • కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ : 02

అర్హత ప్రమాణాలివే :
విద్యార్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :
దరఖాస్తుదారులు ఆగస్టు 1, 2025 నాటికి 18 ఏళ్ల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ, జీతం వివరాలివే :

  • ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది.
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  • ఫిజికల్​స్టాండర్డ్స్​టెస్ట్ (PST)
  • డాక్యుమెంటేషన్​వెరిఫికేషన్
  • ట్రేడ్​టెస్ట్
  • మెడికల్ టెస్టులు
  • రాత పరీక్ష

జీతం ఎంతంటే? :
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ప్రకారం.. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 జీతం లభిస్తుంది.

దరఖాస్తు రుసుము:
జనరల్, OBC, EWS అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి. SC/ST, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎత్తు ఎంత ఉండాలంటే? :
పురుష అభ్యర్థులు : 170 సెం.మీ.
మహిళా అభ్యర్థులు : 157 సెం.మీ.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ (CISF Official Website) ను విజిట్ చేసి గడువులోపు దరఖాస్తు చేసుకోవడమే..