ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. అర్హతలు, అవకాశాలు, దరఖాస్తు విధానం.. పూర్తి విశ్లేషణ

ISRO: భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, పర్యావరణ ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య స్పేస్ సేవలు వంటి విభాగాల్లో పని చేస్తుంది.

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. అర్హతలు, అవకాశాలు, దరఖాస్తు విధానం.. పూర్తి విశ్లేషణ

Complete details about ISRO jobs, opportunities, salary details

Updated On : June 25, 2025 / 5:48 PM IST

ఇస్రో (ISRO – Indian Space Research Organisation) భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, పర్యావరణ ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య స్పేస్ సేవలు వంటి విభాగాల్లో పని చేస్తుంది. ఇస్రోలో పని చేయడం అంటే దేశానికి సేవ చేయడం, శాస్త్రీయ ఆవిష్కరణల్లో భాగస్వామి కావడం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అవకాశం. చాలా మంది ఇస్రోలో జాబ్ చేయడం అంటే పని చేయడంలా కాకుండా ఒక గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇస్రోలో జాబ్స్ కోసం చాలా మంది ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అలాంటి ఒక గైడెన్స్ లాగ ఉండటానికి ఈ ఒక విశ్లేషణ ఇక్కడ దొరుకుతుంది. మరి ఇస్రోలో జాబ్ చేయాలంటే ఎం చేయాలి? ఎక్కడ చదువుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇస్రోలో ఉండే ఉద్యోగ విభాగాలు:

1. సైన్స్ & ఇంజినీరింగ్ విభాగాలు:

  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
  • మెకానికల్ ఇంజినీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ / ఐటీ
  • ఇలెక్ట్రికల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్
  • ఎరోస్పేస్ ఇంజినీరింగ్
  • సివిల్ / అర్కిటెక్చర్

2.టెక్నికల్ అసిస్టెంట్లు:

  • డిప్లొమా అర్హతతో వచ్చే ఉద్యోగాలు ఇస్రో రీసెర్చ్ సెంటర్లు, ల్యాబ్స్, లాంచ్ ప్యాడ్లు, గ్రౌండ్ స్టేషన్లలో అవసరాలు

3. అధికారులు & అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్:

  • అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్

అర్హతలు;

Scientist/Engineer Posts:

  • Scientist/Engineer SC: సంబంధిత విభాగంలో BE/B.Tech పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • Scientist/Engineer SD: సంబంధిత విభాగంలో ME/M.Tech పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • వీరికి వయోపరిమితి 28–35 మధ్యలో ఉండాలి. రాత పరీక్ష ఉంటుంది. తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది.

టెక్నీషియన్/అసిస్టెంట్ :

  • Technician-B: సంబంధిత విభాగంలో ITI పూర్తి చేయాల్సి ఉంటుంది. వయోపరిమితి 18–35 మధ్యలో ఉండాలి

ఇండియాలో ఉన్న ఇస్రో కేంద్రాలు:

  • VSSC (విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్) – కేరళ
  • ISAC / URSC – బెంగళూరు
  • SAC (Space Applications Centre) – అహ్మదాబాద్
  • SHAR (Sriharikota Launch Centre) – ఆంధ్రప్రదేశ్
  • NRSC (National Remote Sensing Centre) – హైదరాబాద్
  • ISTRAC, LPSC, DECU – ఇతర టెక్నికల్ విభాగాలు

జీతం వివరాలు:

  • Scientist/Engineer ‘SC’ వారికి నెలకు రూ. 56,100/
  • Scientist/Engineer ‘SD’ వారికి నెలకు ₹67,700/
  • Technician/Assistant వారికి నెలకు ₹21,700 నుంచి ₹44,900/
  • JPA / Assistant వారికి నెలకు ₹25,500 నుంచి ₹35,400/
  • Officers కి నెలకు ₹56,000 నుంచి ₹1,77,500 లేదా అంతకన్నా ఎక్కవగానే ఉండొచ్చు.

దరఖాస్తు ఎలా చేయాలి?

జాబ్ నోటిఫికేషన్ వస్తే ఆన్‌లైన్ లో అప్లై చేయాలి. ISRO Careers Website: https://www.isro.gov.in/careers

అప్లికేషన్ ఫీజు: ₹250 (సైంటిస్టులకు), ఇతరులకు తక్కువగా ఉంటుంది

ఉపయోగపడే ప్రిపరేషన్ మార్గాలు:

  • ISRO Previous Papers – Tech branches కొరకు
  • GATE syllabus – Scientist ఉద్యోగాలకు ఇది బేస్
  • General English, Reasoning, GK – JPA, Assistants కి
  • Mock Interviews & Personality Development.