మే 22 డీఈఈసెట్ పరీక్ష

డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లామా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్ – 2019 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 22వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. పరీక్ష ఆన్ లైన్‌లో ఉండనుంది. ఆన్ లైన్‌లో మార్చి 11 నుండి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవచ్చని వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన సమాచారం వెబ్ సైట్‌లో పొందవచ్చని, లేదా 7569874190 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసే సమయంలో ఏ మీడియంను ఎంచుకుంటారో ఆ మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని కన్వీనర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
Read Also : TS పాలిసెట్-2019 నోటిఫికేషన్ విడుదల