UPSC Cadre Allocation Process 2023 : యూపీఎస్సీకి ఎంపికైన IAS/IPS/IFS అధికారులకు కేడర్‌లు ఎలా కేటాయిస్తారో తెలుసా ?
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులో యూపీఎస్సీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. అభ్యర్థి ఎవరైనా తన ప్రాధాన్యతను తెలియజేయనప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం కేడర్ ను నిర్ణయిస్తుంది.

UPSC Cadre Allocation
UPSC Cadre Allocation Process 2023 : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ల వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు UPSC కేడర్ కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తుంది. LBSNAAలో ఫౌండేషన్ కోర్సులో IAS అధికారులుగా నమోదు చేసుకున్న అభ్యర్థులు శిక్షణ ప్రారంభానికి ముందే వారికి కేడర్ కేటాయింపు జరుగుతుంది. అయితే IPS మరియు IFS పోస్ట్‌లలోని అభ్యర్థులు వారి నియామకం తర్వాత మాత్రమే కేడర్ కేటాయింపు ప్రక్రియ ఉంటుంది.
READ ALSO : Small Plane Crashes Into Car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం… వీడియో వైరల్
అభ్యర్ధుల ప్రాధాన్యత, వారు ఎంచుకున్న రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా కేడర్ ను కేటాయించటం జరుగుతుంది. కేడర్ కేటాయింపు తరువాత మాత్రమే వారికి ఆఫీసర్ హోదా లభిస్తుంది. ఈ ప్రాసెస్ వివరాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేదాం.
యూపీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన తరువాత, ట్రైనింగ్ అనంతరం అభ్యర్థులకు కేడర్స్ కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. వారు పనిచేయాల్సిన ప్రదేశాన్ని నిర్ణయించిన తరువాత యూపీఎస్సీ కేడర్ కేటాయింపు విధానం ద్వారా అభ్యర్థులను ఆయా కేడర్‌లకు కేటాయిస్తారు. ఈ కేడర్ వారిగా కేటాయింపు అన్నది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)కు మాత్రమే వర్తిస్తుంది.
READ ALSO : AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !
సర్వీస్ మొత్తం ఒకే కేడర్‌లో ;
కేడర్ అనేది ఒక రాష్ట్రం,కేంద్రపాలిత ప్రాంతాల అధారంగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయిస్తారు. ఐఏఎస్ అధికారులు సెంట్రల్ సర్వీసులు అనగా కేంద్రప్రభుత్వ స్థానం కోసం వెళితే తప్ప, వారి సర్వీస్‌లో ఎక్కువ భాగం వారికి ముందుగా కేటాయించిన ఒకే కేడర్‌లో పని చేస్తారు. అయితే కొన్ని అసాధారణ సందర్భాల్లో మాత్రం వారు తమకు ముందుగా కేటాయించిన కేడర్‌ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఐఏఎస్‌లకు ట్రైనింగ్‌కు ముందు, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ తరువాత కేడర్ అలాట్మెంట్ ఉంటుంది.
READ ALSO : AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !
ఐదు జోన్లలో కేడర్ కేటాయింపు ;
కేడర్లను ఐదు జోన్లుగా యూపీఎస్సీ విభజించింది. ఆప్రకారం అభ్యర్థులు ప్రతి జోన్ నుంచి అవరోహణ క్రమంలో క్యాడర్‌లను ఎంచుకొని, తమ ప్రాధాన్యతలను ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా కమిషన్ క్యాడర్‌ను కేటాయిస్తుంది. జోన్ ల వారీగా వివరాలకు సంబంధించి
జోన్-1 ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల కేడర్లు ఉన్నాయి.
జోన్ -II జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్నాయి,
జోన్ – III మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి.
జోన్ – IV మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం; జోన్ -Vలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కేడర్స్ ఉంటాయి.
ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులు ;
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులో యూపీఎస్సీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. అభ్యర్థి ఎవరైనా తన ప్రాధాన్యతను తెలియజేయనప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం కేడర్ ను నిర్ణయిస్తుంది. మెరిట్ వివరాలతోపాటుగా, ఖాళీల ఆధారంగా యూపీఎస్సీ వారి వారి స్వంత రాష్ట్రాలకు క్యాడర్లను కేటాయిస్తుంది. హోమ్ క్యాడర్‌ను కోరుకోని అభ్యర్థులకు, వారు ప్రాధాన్యత ఇచ్చిన కేడర్‌ను కేటాయిస్తారు. ఒకే ర్యాంకు సొంతం చేసుకున్న అభ్యర్థుల విషయంలో వారి పేర్లలోని అక్షరక్రమం అధారంగా కేడర్ కేటాయింపు ఉంటుంది.
READ ALSO : Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకి నోరూరించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ.. అందులో ఏమున్నాయంటే?
అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద షార్ట్‌లిస్ట్ అయిన రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ఆధారంగా క్యాడర్ కేటాయిస్తారు. అన్‌రిజర్వ్‌డ్ స్థానాలు అందుబాటులో లేనిపక్షంలో రిజర్వ్‌డ్ ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటారు. శారీరకంగా లోపాలు ఉన్న అభ్యర్థులు తమ మొదటి ఎంపిక జోన్‌లో ఏదైనా రాష్ట్రం లేదా UPSC కేడర్ ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు.