అప్లై చేసుకోండి : ఈస్ట్ కోస్ట్ రైల్వే లో 1216 అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 08:16 AM IST
అప్లై చేసుకోండి : ఈస్ట్ కోస్ట్ రైల్వే లో 1216 అప్రెంటిస్ ఉద్యోగాలు

Updated On : December 9, 2019 / 8:16 AM IST

ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1216 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
ఈస్ట్ కోస్ట్ రైల్వే ,హెడ్ క్వాటర్స్ – 10
క్యారేజ్ మరమ్మతు వర్క్ షాప్ – 250
ఖుర్దా రోడ్ డివిజన్ – 317
వాల్ట్ యిర్ డివిజన్ – 553
సంబల్పూర్  డివిజన్ -86

విద్యార్హత :
అభ్యర్ధులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధింత విభాగంలో ఐటీఐ ఉండాలి.

దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబిసీ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం :
అభ్యర్ధులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 7, 2019.
దరఖాస్తు చివరి తేది : జనవరి 6, 2020.

Read Also: దరఖాస్తు చేసుకోండి : NEET-2020 అడ్మిషన్లు ప్రారంభం