ONGC Recruitment : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

Filling job vacancies in Oil and Natural Gas Corporation Limited
ONGC Recruitment : భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన మంగళూరులోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యురిటీ, మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 39 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.mrpl.co.in/careers పరిశీలించగలరు.