JOBS : ఈఎస్ఐసీ లో స్పెషలిస్ట్ గ్రేడ్ 2 ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు, ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.

JOBS : ఈఎస్ఐసీ లో స్పెషలిస్ట్ గ్రేడ్ 2 ఖాళీల భర్తీ

Esic

Updated On : June 12, 2022 / 11:28 AM IST

JOBS : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ మధ్యప్రదేశ్ రీజియన్ లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, సర్జికల్ అంకాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు, ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐ కార్పొరేషన్ , పంచదీప్ భవన్, నందా నగర్, ఇండోర్, మధ్యప్రదేశ్, దరఖాస్తులకు చివరి తేదిగా జులై 4, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; : www.esic.nic.in పరిశీలించగలరు.