Samagra Siksha AP : ఏపి సమగ్ర శిక్షా సొసైటీ భవిత కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి గడువు సెప్టెంబర్‌ 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు నిర్ణయించారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు.

Samagra Siksha AP : ఏపి సమగ్ర శిక్షా సొసైటీ భవిత కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Samagra Siksha AP

Updated On : September 1, 2023 / 11:00 PM IST

Samagra Siksha AP : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 396 సహిత విద్యా రీసోర్స్‌పర్సన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలను నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు వర్తిస్తుంది. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది.

READ ALSO : Reproductive Health : పురుషులు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వాస్తవాలు !

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి గడువు సెప్టెంబర్‌ 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు నిర్ణయించారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.