Siddipet KVS Recruitment : సిద్దిపేట కేవిఎస్ లో టీచింగ్ పోస్టుల భర్తీ

టీజీటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 50శాతం మార్కులతో ఎన్సీఈఆర్టీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 ఏళ్లకు మించరాదు.

Siddipet KVS Recruitment : సిద్దిపేట కేవిఎస్ లో టీచింగ్ పోస్టుల భర్తీ

Siddipet KVS

Updated On : August 22, 2022 / 1:54 PM IST

Siddipet KVS Recruitment : ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఒకటైన సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయ లో టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టీజీటీ, పీఆర్ టీ, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ తదితర విభాగల్లో ఖాళీలు ఉన్నాయి.

టీజీటీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 50శాతం మార్కులతో ఎన్సీఈఆర్టీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 ఏళ్లకు మించరాదు. పీఆర్ టీ పోస్టులకు సంబంధించి కనీసం 50శాతం మార్కులతో సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ , డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఇఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు సంబంధించి బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 30ఏళ్ల కు మించరాదు.

అభ్యర్ధుల ఎంపిక విషయానకి వస్తే ఇంటర్వ్యూద్వారా ఉంటుంది. ఇంటర్వ్యూలో మెరిట్ అధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఆగస్టు 24,25, 2022లలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; ఫస్ట్ ఫ్లోర్, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో, సిద్ధిపేట.