GATE 2024 Results Date : గేట్-2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్‌.. రెస్పాన్స్ షీట్ విడుదల.. ఇక ఫలితాలు ఎప్పుడంటే?

GATE 2024 Results Date : గేట్ 2024 అభ్యర్థులకు అలర్ట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదల అయింది. వచ్చే మార్చి 16న గేట్ రిజల్ట్స్ వెల్లడి కానున్నాయి.

GATE 2024 Results Date : గేట్-2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్‌.. రెస్పాన్స్ షీట్ విడుదల.. ఇక ఫలితాలు ఎప్పుడంటే?

GATE 2024 Results Date And Time Out, Response Sheet Released Today

GATE 2024 Results Date : బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2024కి సంబంధించిన రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రశ్నలకు వారి ప్రతిస్పందనలను చెక్ చేసుకోవచ్చు. అయితే, ఈ నెల (ఫిబ్రవరి) 3, 4, 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలలో రెండు షిఫ్టులలో గేట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

గేట్ 2024 పరీక్ష ఆన్సర్ కీ కూడా ఫిబ్రవరి 21న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25, 2024 వరకు అనుమతి ఉంటుంది. చివరిగా, గేట్ 2024 ఫలితాలు మార్చి 16న ప్రకటించనున్నారు. గేట్ పరీక్ష సంబంధిత స్కోర్‌కార్డులు మార్చి 23, 2024న అందుబాటులో ఉంటాయి.

గేట్ 2024 రెస్పాన్స్ షీట్‌ని ఇలా చెక్ చేయండి :

  • gate2024.iisc.ac.in అనే అధికారిక వెబ్‌సైట్ (IISc GATE) విజిట్ చేయండి.
  • హోం పేజీలో కనిపించే (GATE 2024) అభ్యర్థుల (Response Sheet) లింక్‌ను ఎంచుకోండి.
  • లేటెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీని యాక్సెస్ చేయండి.
  • అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాలి.
  • స్క్రీన్‌పై రెస్పాన్స్ షీట్ కోసం Submit బటన్‌ను నొక్కండి.
  • అభ్యర్థి రెస్పాన్స్ షీట్ చూడవచ్చు. ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఫ్రింట్ కాపీని ఉంచుకోండి.

మార్చి 16న గేట్ 2024 ఫలితాలు.. ఎలా చెక్ చేయాలి? :
గేట్ ఫలితాలు మార్చి 16న వెల్లడి అయిన తర్వాత పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్‌లో (GATE 2024) ఫలితాల స్కోర్‌కార్డ్‌ను చూడవచ్చు. ఆపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలిత ప్రకటనను యాక్సెస్ చేసేందుకు ఈ కిందివిధంగా ప్రయత్నించాలి.

  • అధికారిక (gate2024.iisc.ac.in) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, GATE 2024 Results లింక్‌పై క్లిక్ చేయండి.
  •  అభ్యర్థి లాగిన్ పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.
  •  GATE స్కోర్‌కార్డ్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  •  మార్క్‌షీట్‌ను చెక్ చేసుకుని ఆపై డౌన్‌లోడ్ చేయండి.
  •  ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్డ్‌కాపీని మీ దగ్గర ఉంచుకోండి.

Read Also : APRCET-2024 Notification : ఏపీఆర్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచే దరఖాస్తులు ప్రారంభం