10th స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్

10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి.

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 09:52 AM IST
10th స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్

Updated On : April 16, 2019 / 9:52 AM IST

10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి.

10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కారం చూపాలని కోరారు. దీనితో విద్యాశాఖ స్పందించింది. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు 6 మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రశ్నలను టచ్ చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. 

పేపర్ -1లో ఐదున్నర మార్కులు, పేపర్ – 2లో అర మార్కు కలుపుతామని వెల్లడించింది. పేపర్ -1 లోని పార్ట్ ఏ లో 6వ ప్రశ్నకు ఒక మార్కు..16వ ప్రశ్నకు 4 మార్కులు..పార్ట్ – బిలోని 7వ ప్రశ్నకు అర మార్కుతో పాటు పేపర్ – బిలోని 4వ ప్రశ్నకు అర మార్కు కలుపనున్నారు. 

పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 69,255 రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 306 పరీక్ష కేంద్రాలు, ఫెయిలైన విద్యార్థుల కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
Read Also : ప్లీజ్ డౌన్ లోడ్ : ఏపీ ఎంసెట్ హాల్ టిక్కెట్లు రెడీ