గుడ్ న్యూస్ : రైల్వేలో 12 వేల ఉద్యోగాలు 

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 03:46 AM IST
గుడ్ న్యూస్ : రైల్వేలో 12 వేల ఉద్యోగాలు 

Updated On : February 14, 2019 / 3:46 AM IST

హైదరాబాద్‌: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆరు డిపార్ట్ మెంట్స్ లలో మొత్తం 12,433 ఉద్యోగాలను భర్తీ రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

ఫిబ్రవరి నెలాఖరులోపు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జోన్‌ భారతీయ రైల్వేలో సహా ఇతర జోన్లలోనూ ఎక్కువమొత్తంలో పోస్టులు ఖాళీలున్నాయి. వీటికి త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఖాళీలు, 2020 సంవత్సరానివి కూడా కలిపి దేశవ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. దీంట్లో భాగంగా..ఫిబ్రవరి నెలలో దాదాపు 1.31 లక్షల ఉద్యోగాలను ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ద.మ రైల్వే పరిధిలో 12వేల పైచిలుకు ఉద్యోగాలను చేర్చారు.
 

డిపార్ట్ మెంట్స్         పోస్టులు 
లోకో పైలెట్    2781
పాయింట్స్ మన్

   884

ట్రాక్ మెయింటెనర్      3940
టెక్నీషియాన్    2475
హెల్పర్స్           1346
జూనియర్ ఇంజనీర్స్      707