CBSE exams: ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో..
మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు.

CBSE
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ)లో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఒక ఏడాదిలో రెండుసార్లు రాసే ఛాన్స్ రానుంది. తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించి, రెండో దశ పరీక్షలను మేలో నిర్వహిస్తారు.
ఈ మేరకు సీబీఎస్‌ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. పబ్లిక్ నోటీస్‌ను కూడా సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. వచ్చేనెల 9 వరకు ప్రజలు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. అనంతరం దానికి సీబీఎస్‌ఈ ఆమోదం తెలుపుతుంది.
ముసాయిదాలోని అంశాలు
- విద్యార్థులు తమ ఇష్టం మేరకు రెండు దశల్లోనూ పరీక్షలు రాయొచ్చు
- తొలిసారి రాసిన ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన సబ్జెక్టులను రెండో దశ పరీక్షల సమయంలో రాయొద్దని భావిస్తే వాటిని పక్కనపెటొచ్చు
- తొలి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకు ఉంటాయి
- రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయి
- రెండు దశల ఎగ్జామ్స్‌లో పాఠ్యాంశాలు అన్నింటినీ పరిగణనలో ఉంటాయి
- స్టూడెంట్స్‌కు రెండు దశలకూ ఎగ్జామ్ సెంటర్ ఒకటే ఉంటుంది
- 2026లో జరిగే ఎగ్జామ్స్‌ను రాసే స్టూడెంట్స్ లిస్టును 2025 సెప్టెంబరులో ఫైనల్ చేస్తారు
- తొలి దశ ఎగ్జామ్స్‌లో ఏదైనా సబ్జెక్టు రాయలేదంటే దాని స్థానంలో మరో సబ్జెక్టును ఎంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది
- మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు