గిరిజన గురుకులాల్లో నోటిఫికేషన్ : 1100 ఖాళీలు

గిరిజన గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT), పీఈటీ పోస్టులకు నేరుగా నియామకాలు చేపట్టేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీని నాలుగు జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.
* పోస్టుల సంఖ్య:
పోస్టులు | ఖాళీలు |
జూనియర్ లెక్చరర్లు (JL) | 44 |
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) | 56 |
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) | 876 |
పీఈటీ | 124 |
మొత్తం పోస్టులు | 1100 |
* జోన్ల వారీగా ఖాళీలు…
జోన్లు | పీజీటీ | టీజీటీ | పీఈటీ | మొత్తం |
జోన్-1 | 26 | 173 | 19 | 218 |
జోన్-2 | 16 | 143 | 18 | 177 |
జోన్-3 | 04 | 313 | 49 | 366 |
జోన్-4 | 10 | 247 | 38 | 295 |
మొత్తం ఖాళీలు | 56 | 876 | 124 | 1056+ 44 జేఎల్ = 1100 |