ఏపీలో ICET.. రెండు సెషన్‌లలో పరీక్ష

డిగ్రీ పూర్తి చేసుకుని MBA, MCA, కోర్సుల్లో ప్రవేశించాలనుకునే అభ్యర్థుల కోసం శుక్రవారం (ఏప్రిల్ 26,2019)న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ICET) నిర్వహిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతోంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 200 మార్కులకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
రాష్ట్రవ్యాప్తంగా 98 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 52,736 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతోంది. మెదటి పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతున్నాయి. పరీక్షలో 50 మార్కులు దాటిన విద్యార్థులకు ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ పరీక్ష ఫలితాలను మే 6న వెల్లడిస్తారు.