IFS ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్‌ను మంగళవారం (ఫిబ్రవరి 19,2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర అటవీ, పర్యావరణ విభాగంలోని అధికారి పోస్టులను భర్తీ చేస్తారు.
* విద్యా అర్హులు:
సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
* వయసు పరిమితి:
01.08.2019 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 19.02.2019. |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 18.03.2019 |
IFS ప్రిలిమినరీ పరీక్ష తేది | 02.06.2019. |
IFS మెయిన్ పరీక్ష తేది | 01.12.2019. |