రైల్వేలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 10:27 PM IST
రైల్వేలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం

Updated On : September 6, 2020 / 7:20 AM IST

రైల్వే లక్షల ఉద్యోగాల భర్తికి సంబంధించి పరీక్షల ప్రక్రియపై రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనుంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.



మూడు విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయింది. రైల్వేలో 1,40,640 ఉద్యోగాల కోసం రైల్వేశాఖ రెండేళ్ల క్రితమే నోటిఫికేషన్ వెలువడింది. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు.



అభ్యర్థులందరికీ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) నిర్వహించాల్సి ఉంది. కరోనా వ్యాప్తితో పరీక్షలు వాయిదా పడ్డాయి. రైల్వే ఉద్యోగాల పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ అతి త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.



రైల్వేశాఖ గతంలో పలు కేటగిరీల్లో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నాన్ టెక్నికల్ పాపులారిటీ కేటగిరీ (NTPC)కింద గార్డులు, ఆఫీస్ క్లర్క్ లు, కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు 35,208, మినిస్టీరియల్ కేటగిరీ కింద స్టెనో తదితర పోస్టులు 1663.. ట్రాక్ నిర్వహణ, పాయింట్ మెన్ వంటి పోస్టులు 1,03,769 ఖాళీగా ఉన్నాయి.