ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు.. లక్షాయాభై వేలు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు.. లక్షాయాభై వేలు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

ISRO Recruitment

Updated On : June 8, 2025 / 11:05 AM IST

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులోభాగంగా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ జరుగనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in లేదా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సైట్ vssc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 18వ తేదీని చివరి తేదీగా సూచించారు.

పోస్టులు: 27 టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులు, 12 టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) పోస్టులు, 8 టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్) పోస్టులు. 4 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్, ఆటోమొబైల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ) పోస్టులు, 5 సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) పోస్టులు, 2 లైబ్రరీ అసిస్టెంట్-ఏ పోస్టులు.

విద్యా అర్హతలు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పూర్తి చేయాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. లైబ్రరీ అసిస్టెంట్ కోసం లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది. వారు ప్రభుత్వ అలవెన్సులు, పదోన్నతి ప్రయోజనాలు ఉంటాయి.

లా అప్లై చేసుకోండి: మెుదట vssc.gov.in అధికారిక సైట్‌ కు వెళ్ళాలి. హోమ్‌పేజీలో “VSSC రిక్రూట్‌మెంట్ పై క్లిక్ చేయాలి. తరువాత మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. రుసుము చెల్లించి కన్ఫామ్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.