JEE Mains 2025: జేఈఈ మెయిన్-2025 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 కోసం ఎన్టీఏ ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను రిలీజ్ చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ – 2025 ఏప్రిల్ సెషన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏ నిమిషంలోనైనా అడ్మిట్ కార్డులను విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 కోసం ఎన్టీఏ ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను రిలీజ్ చేసింది. పరీక్ష వచ్చేనెల 2 నుంచి 9 వరకు జరగనుంది. బీటెక్, బీఈ పేపర్లకు ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో, బీఆర్క్, బీప్లానింగ్ పేపర్ల పరీక్షలు (పేపర్ 2ఏ, 2బీ) ఏప్రిల్ 9న జరుగుతాయి.
Also Read: భారత్‌లో వివో వై39 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. తక్కువ ధరకే ఎంత బాగుందో తెలుసా?
ఈ ఏడాది ప్రారంభంలో జేఈఈ మెయిన్ సెషన్ 1కి 12.58 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. 14 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోర్‌ను సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్ అభ్యర్థులు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్క అభ్యర్థి ఉన్నారు.
https://jeemain.nta.nic.in లోని డైరెక్ట్ లింక్ ద్వారా జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- https://jeemain.nta.nic.in ఓపెన్ చేయండి
- JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
- దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని టైప్ చేయండి
- పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి