Job Notification : ఏపి హైకోర్టులో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Court
Job Notification : అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో లా క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు మూడు లేదా ఐదేళ్ళ లా డిగ్రీని అర్హతగా నిర్ణయించారు.
అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. డిసెంబర్ 6వతేదిన వైవా వాయిస్ నిర్వహించేందుకు తేదిని ముందుగానే ప్రకటించారు.
అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తుకు ఆఖరి తేది నవంబరు 23. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్ ( రిక్రూట్ మెంట్), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా-5222237, పూర్తి వివరాలకు వెబ్ సైట్ https//hc.ap.nic.in/