Nuacem AI Hiring: సాఫ్ట్ వేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నువాసెం AI సంస్థలో జావాస్క్రిప్ట్ తో ఓపెనింగ్స్.. రూ.3.6 లక్షల జీతం.. రేపే లాస్ట్ డేట్

Nuacem AI Hiring: నువాసెం AI కంపెనీ సాఫ్ట్ వేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఫుల్‌టైమ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ ఉద్యోగాలు అందించే అవకాశాన్ని కల్పించనుంది.

Nuacem AI Hiring: సాఫ్ట్ వేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నువాసెం AI సంస్థలో జావాస్క్రిప్ట్ తో ఓపెనింగ్స్.. రూ.3.6 లక్షల జీతం.. రేపే లాస్ట్ డేట్

Job openings with JavaScript at Nuvasem AI company

Updated On : August 1, 2025 / 3:56 PM IST

నువాసెం AI కంపెనీ సాఫ్ట్ వేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఫుల్‌టైమ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ ఉద్యోగాలు అందించే అవకాశాన్ని కల్పించనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది. కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు.

ఉద్యోగం, అర్హత, జీతం వివరాలు:

విద్యార్హత:
అభ్యర్థులు బీటెక్/బీఎస్సి ఇన్ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ(కంప్యూటర్ సైన్స్) 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. అది కూడా 2024, 2025లో పాస్‌అవుట్‌ అయ్యుండాలి. జావా స్క్రిప్ట్, నోడ్.జేఎస్ లో ఫార్మల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ట్రైనింగ్ సమయంలో కనీసం ఒక పూర్తి బ్యాక్‌ ఎండ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు:

  • Socket.io లేదా WebSocket పై ప్రాథమిక అవగాహన ఉండాలి
  • Telegram, WhatsApp వంటి బాట్ ప్లాట్‌ఫార్మ్స్‌ పరిచయం ఉండాలి
  • JSON, JWT, Middleware, API Security పై అవగాహన కలిగి ఉండాలి

ఎంపిక విధానం:

  • లాజికల్ & లాంగ్వేజ్ ఫండమెంటల్స్ టెస్ట్
  • టెక్నికల్ ఇంటర్వ్యూ
  • మేనేజీరియల్ / HR ఇంటర్వ్యూ

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.2.4 నుంచి రూ.3.6 లక్షల వరకు జీతం ఇస్తారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://nuacem.com ను సంప్రదించవచ్చు. అలాగే మీ రెస్యూమ్ ను అధికారిక మెయిల్ placementexecutive4_cr_task@telangana.gov.in కి సెండ్ చేయవచ్చు.