Ircon : ఇర్కాన్ ఇంటర్నేషనల్ లో ఉద్యోగాల భర్తీ

సివిల్ ఎగ్జిక్యూటివ్స్ కు అర్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

Ircon : ఇర్కాన్ ఇంటర్నేషనల్ లో ఉద్యోగాల భర్తీ

Ircon Delhi

Updated On : February 23, 2022 / 7:47 PM IST

Ircon : న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 40. పోస్టుల వివరాలకు సంబంధించి సివిల్ అసిస్టెంట్‌ మేనేజర్లు20 ఖాళీలు, సివిల్ ఎగ్జిక్యూటివ్స్20 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

సివిల్ అసిస్టెంట్‌ మేనేజర్ల అర్హతకు సంబంధించి కనీసం 75 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతంగా నెలకి రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

సివిల్ ఎగ్జిక్యూటివ్స్ కు అర్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతంగా నెలకి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేది 8 మార్చి2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ircon.org/సంప్రదించగలరు.