AAI JOBS : ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.

Air Force Authority Of India
AAI JOBS : భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు ఉన్నాయి. 27 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు జూన్ 15, 2022 నుండి ప్రారంభమౌతాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది జులై 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.AAI.AERO/ పరిశీలించగలరు.