JOBS : కృష్ణాజిల్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ ఎంఎల్ టీ ఉత్తీర్ణులై ఉండాలి. కమ్యునికేషన్ నైపుణ్యంతోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

JOBS : కృష్ణాజిల్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఉద్యోగాల భర్తీ

Jobs

Updated On : June 6, 2022 / 10:40 AM IST

JOBS : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రాస్ట్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ఆరోగ్య మిత్రలు 22, టీమ్ లీడర్లు 6 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 సంవత్సరాలకు మించరాదు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ ఎంఎల్ టీ ఉత్తీర్ణులై ఉండాలి. కమ్యునికేషన్ నైపుణ్యంతోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి విద్యార్హతలు, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఎంపికైన వారికి నెలకు 15000, టీమ్ లీడర్ పోస్టులకు నెలకు 18500 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది 11 జూన్ 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ , కృష్ణా జిల్లా, ఏపి. పూర్తి వివరాలకు https://www.ysraarogyasri.ap.gov.in/ పరిశీలించగలరు.