Jobs : ఎన్ హెచ్ ఎఐలో ఉద్యోగాల భర్తీ
పరీక్షా విధానానికి సంబంధించి పరీక్షలో పార్ట్-1, పార్ట్-2 అని రెండు విభాగాలుంటాయి. ఈ రెండు పేపర్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.

Nhai
Jobs : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)లో పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్)కు సంబంధించి మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్ ఇన్ కామర్స్/సీఏ/సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వెతనంగా చెల్లిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
పరీక్షా విధానానికి సంబంధించి పరీక్షలో పార్ట్-1, పార్ట్-2 అని రెండు విభాగాలుంటాయి. ఈ రెండు పేపర్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ధరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి జనరల్ అభ్యర్థులు రూ.500, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ధరఖాస్తు చేసుకునేందుకు చివరితేది నవంబరు 29గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nhai.gov.in