Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 35 నుంచి 33కి తగ్గింపు.. ఈ ఏడాది నుంచే అమలు

Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద వతరగతి పాస్ మార్కుల శాతాన్ని 35 నుంచి 33 కి తగ్గించింది.

Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 35 నుంచి 33కి తగ్గింపు.. ఈ ఏడాది నుంచే అమలు

Karnataka government reduces class 10 pass percentage from 35 to 33

Updated On : July 26, 2025 / 2:46 PM IST

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద వతరగతి పాస్ మార్కుల శాతాన్ని 35 నుంచి 33 కి తగ్గించింది. కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (సవరణ) 2025 నిబంధనల ముసాయిదాలో భాగమైన ఈ మార్పు జూలై 25న రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించబడింది. అయితే, ఈ నిర్ణయంపై తల్లితండ్రుల, టీచర్ల అభిప్రాయం తెలుసుకోవడం కోసం 15 రోజుల సమయాన్ని కేటాయించింది. వారి అభిప్రాయ సేకరణ తరువాతనే ఈ మార్పు అమలులోకి రానుంది.

ఇక కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుంది. విద్యార్థులు 625 మార్కులకు గాను 206 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ, ప్రతీ సబ్జెక్టులో 30 శాతం మార్కులు తెచ్చుకోవాలి. అంటే 80 మార్కులకు గాను 24 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఉతీర్ణత సాదించినట్టుగా పరిగణిస్తారు. ఇక ఈ మార్పు గ్రామీణ, వెనుకబడిన వర్గాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు SSLC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సహాయపడుతుందని, అదే సమయంలో ప్రాథమిక నాణ్యత ప్రమాణాలను కొనసాగిస్తుందని అధికారులు భావిస్తున్నారు.