SBI Recruitment : ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తులకు ముగియనున్న తుదిగడువు

డాట్‌నెట్‌ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్‌ ప్రాసెస్, ఆపరేషన్స్‌ టీమ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో ఉన్న మేనేజర్, రిలేషన్‌ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్, సీనియర్‌ రిలేషన్‌ మేనేజర్,రీజనల్‌ హెడ్, అసిస్టెంట్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

SBI Recruitment : ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తులకు ముగియనున్న తుదిగడువు

Last date for applications for SBI Specialist Cadre Officer posts

Updated On : September 19, 2022 / 1:21 PM IST

SBI Recruitment : ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ (ఎస్ సీఓ) పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరకుంది. డాట్‌నెట్‌ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్‌ ప్రాసెస్, ఆపరేషన్స్‌ టీమ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో ఉన్న మేనేజర్, రిలేషన్‌ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్, సీనియర్‌ రిలేషన్‌ మేనేజర్,రీజనల్‌ హెడ్, అసిస్టెంట్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ,బీటెక్‌,బీఈ,ఎంటెక్‌,ఎంఈ,ఎంసీఏ,ఎంఎస్సీ,కంప్యూటర్‌సైన్స్‌,ఇంజనీరింగ్‌ ,ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ,సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ,ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎంబీఏ, పీజీ,పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధి విభాగంలో కనీసం 2 నుండి 12 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు 20 సెప్టెంబర్ 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.