Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 35 కంపెనీలు, 4062 జాబ్స్.. అర్హత, దరఖాస్తు, జీతం పూర్తి వివరాలు
జులై 26 శనివారం రోజున విజయనగరం జిల్లా ముంజేరు మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెగా జాబ్‌మేళా జరగనుంది. 35 కంపెనీలలో ఖాళీగా ఉన్న 4062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

Mega Job Fair at Miracle Engineering College on July 26th
చదువు అయిపోయి మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. జులై 26 శనివారం రోజున విజయనగరం జిల్లా ముంజేరు మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెగా జాబ్‌మేళా జరగనుంది. 35 కంపెనీలలో ఖాళీగా ఉన్న 4062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. వివిధ ఉద్యోగాలకు వివిధ విద్యార్హతలు, అనుభవం ఉన్నవారిని ఎంపిక చేయనున్నారు. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం ఈ 9000102013 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
సంస్థ, ఉద్యోగం, ఖాళీలు, జీతం వివరాలు:
- 20-50 హెల్త్ కేర్బె: బెడ్ సైడ్ కేర్ గివర్ పోస్టులు 30, జీతం: రూ.12,000
- 24/7 జాబ్స్: తెలుగు BPO కాలర్స్ పోస్టులు 25, జీతం: రూ.1.5 నుంచి రూ.2.4 లక్షలు
- ఆదిత్య బిర్లా క్యాపిటల్: బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు 20, జీతం: రూ.15,000
- APAC ఫైనాన్స్ సర్వీస్: లోన్ ఆఫీసర్ పోస్టులు 100, జీతం: రూ.12,000
- అపోలో పార్మసీ: పార్మసీ అసిస్ట్ పోస్టులు 85, జీతం: రూ.15,000
- ATC టైర్స్: ప్రొడక్షన్ కెమిస్ట్, QC, QA పోస్టులు 200, జీతం రూ.19,000
- అరబిందో పార్మా: ట్రైనీ పోస్టులు 300, జీతం: రూ.13,000 నుంచి రూ.15,000
- బ్లింకిట్: ఫికర్/ప్యాకర్స్ పోస్టులు 400, జీతం: రూ.16,500
లాంటి చాలా కంపెనీలు తమ సంస్థల్లో ఉంద్యోగాలు కల్పించనున్నాయి. కాబట్టి, ఈ అద్భుతమైన అవకాశాని నిరుద్యోగులు తప్పకుండ వినియోగించుకోవాలని అధికారులు కోరారు.