5న నీట్ పరీక్ష..నిబంధనలు : ఆభరణాలు, షూ ధరించకూడదు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 02:15 AM IST
5న నీట్ పరీక్ష..నిబంధనలు : ఆభరణాలు, షూ ధరించకూడదు

Updated On : May 1, 2019 / 2:15 AM IST

MBBS, BDSలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పరీక్ష మే 5న జరుగనుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం,  రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థుల అడ్మిట్ కార్డులో పొందుపరిచారు. 15 శాతం సీట్లకు పోటీ పడి అడ్మిషన్ సాధించుకోవడానికి వీలు కలుగుతుంది. నీట్ పరీక్ష 180 ప్రశ్నలకు 720 మార్కులుంటాయి. మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది. 

విద్యార్థులు తెలుగులో రాయడానికి అనుమతినిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాసే విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషమైనా లోనికి అనుమతించారు. 1.45 గంటలకు టెస్టు బుక్ లెట్‌లు ఇస్తారు. 1.50గంటల వరకు టెస్టు బుక్ లెట్‌లో అవసరమైన సమాచారాన్ని రాయాలి. 

ఇదిలా ఉంటే విద్యార్థులకు పలు కండీషన్స్ పెట్టింది. 
* పెన్సిల్, బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ తదితర వాటిని అనుమతినించారు. 
* మొబైల్ ఫోన్, బ్లూ టూత్, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్రాండ్ నో ఎంట్రీ ఉంటుంది. 
* వాచ్, రిస్టువాచ్, బ్రాస్ లెట్, కెమెరా వంటివి తేవొద్దు. ఎటువంటి ఆభరణాలను ధరించకూడదు. 
* డ్రెస్ కోడ్ పాటించాలి. హాఫ్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్‌తో కూడిన లైట్ క్లాత్స్ అనుమతించరు. 
* బూట్లు అనుమతించరు. స్లిప్పర్లు, శాండిళ్లు, తక్కువ హీల్స్ కలిగిన చెప్పులను అనుమతినిస్తారు. 
* మంచినీళ్ల బాటిళ్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్‌లకు అనుమతినించదు. 
* యాపిల్, నారింజ వంటి పండ్లకు అనుమతి. 
* నిషేధిత వస్తువులను పొరపాటున తీసుకొచ్చినా పరీక్ష కేంద్రం వద్ద వాటిని దాచుకొనేందుకు ఏర్పాట్లు చేశారు.