NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్ 3 రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?
NEET PG Counselling 2024 : రౌండ్ 3 రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్, చాయిస్-ఫిల్లింగ్, చాయిస్-లాకింగ్ ప్రక్రియ జనవరి 22 నుంచి 23 వరకు జరుగుతుంది.

NEET PG Counselling 2024
NEET PG Counselling 2024 : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 మూడో రౌండ్ షెడ్యూల్‌ను మళ్లీ సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. రౌండ్ 3 కోసం రిజిస్టర్ చేసేందుకు చివరి తేదీ జనవరి 22, 2025 (మధ్యాహ్నం వరకు) వరకు పొడిగించింది.
Read Also : Best Phones 2025 : ఈ నెలలో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
ఇంతకుముందు, దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 19. ఇప్పుడు ఆప్షన్-ఫిల్లింగ్, ఆప్షన్-లాకింగ్ ప్రక్రియ జనవరి 22 నుంచి జనవరి 23 వరకు జరుగుతుంది. సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు జనవరి 25న ప్రకటించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 3లోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా డేటా వెరిఫికేషన్ ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 5 మధ్య జరుగుతుంది.
“కొన్ని రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ ఆలస్యం కావడం, రాజస్థాన్‌లో ఇటీవల రౌండ్-2 ఫలితాలు ప్రకటించడంతో పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను పొడిగించాలని ఎంసీసీకి అనేక అభ్యర్థనలు అందుతున్నాయని అభ్యర్థులందరికీ సమాచారం. అందువల్ల, అభ్యర్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రౌండ్ 3 అప్‌గ్రేడేషన్ చివరి రౌండ్ కావడంతో పీజీ కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్ పొడిగిస్తున్నాం” అని అధికారిక నోటీసు పేర్కొంది.
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 రౌండ్ 3 : ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
నీట్ పీజీ 2024లో కనీసం 15 పర్సంటైల్ సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు, పరీక్షలో కనీసం 10 పర్సంటైల్ పొందిన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు రౌండ్ 3కి దరఖాస్తు చేసుకోవచ్చు.
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 రౌండ్ 3 : ఎలా దరఖాస్తు చేయాలి? :
- అధికారిక వెబ్‌సైట్ (mcc.nic.in)ని సందర్శించండి.
- హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి పీజీ మెడికల్‌ని ఎంచుకోండి
- కోర్సును ఎంచుకుని నీట్ పీజీ 2024 రోల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- ఫారమ్‌ను సమర్పించి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి
- కన్ఫార్మ్ పేజీని డౌన్‌లోడ్ చేసి, నెక్స్ట్ ప్రింటవుట్ తీసుకోండి.
నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్ 3 కోసం ఎంసీసీ 15,902 వర్చువల్ ఖాళీలను ప్రకటించింది. ఇంకా, థర్డ్ రౌండ్ కోసం రాష్ట్రాలలో మొత్తం 8,313 ఖాళీలు, 99 కొత్త సీట్లు ప్రకటించారు. 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, 100 శాతం డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్‌ఎంఎస్, పీజీ డీఎన్‌బీ సీట్లకు నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
Read Also : SI Recruitment 2025 : ఒడిషా పోలీస్ ఎస్ఐ రిక్రూట్‌మెంట్.. 933 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!