NEET UG Registrations : నీట్-2024 యూజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లకు ఈరోజే లాస్ట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

NEET UG 2024 రిజిస్ట్రేషన్‌లు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. శనివారం రాత్రి 11:50 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

NEET UG Registrations : నీట్-2024 యూజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లకు ఈరోజే లాస్ట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

NEET UG_ Registrations To Close Today For National Eligibility Cum Entrance Exam

NEET UG: Registrations : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం (NEET UG 2024) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి పరీక్ష కోసం ఈరోజు (మార్చి 9) రాత్రి 9గంటల లోపు రిజిస్టర్ చేసుకోవచ్చు.

అంతేకాదు.. క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్-బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని గడువు కూడా ఈరోజు రాత్రి 11:50 వరకు మాత్రమే ఉంది. జనరల్ కేటగిరీ, ఎన్ఆర్ఐ అభ్యర్థులు రూ. 1,700 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది.

Read Also : Tiktok Chroming Challenge : 11ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన డేంజరస్ టిక్‌టాక్ ‘క్రోమింగ్’ ఛాలెంజ్ ట్రెండ్.. అసలు ఇదేంటి?!

అయితే, జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులు రూ. 1,600, ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1,000 చెల్లించాలి. దరఖాస్తు ఎడిట్ చేయడం, అడ్మిట్ కార్డ్‌ల విడుదల తేదీ వెబ్‌సైట్‌లో తర్వాత వెల్లడి కానున్నాయి. అభ్యర్థులు నీట్ (UG) 2024 కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ఆఫ్ లైన్ మోడ్‌లో దరఖాస్తు ఫారమ్ అంగీకరించరని గమనించాలి. దరఖాస్తులు (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియకు ముఖ్యమైన డాక్యుమెంట్లు :

  • లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, స్కాన్ చేసిన ఫొటోలు
  • పోస్ట్‌కార్డ్ సైజు ఫొటో
  • సిగ్నేచర్ : ఎడమ, కుడి చేతి వేళ్లు, బొటనవేలు ఫింగర్ ఫ్రింట్
  • కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే) సమర్పించాలి.
  • అవసరమైతే.. పౌరసత్వ ధృవీకరణ పత్రం
  • PwBD సర్టిఫికేట్ (వర్తించే చోట)
  • అడ్రస్ ప్రూఫ్ (కరెంట్, పర్మినెంట్ అడ్రస్)
  • లేటెస్ట్ ఫొటో కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఉండాలి.
  • 80శాతం ఫేస్ మాస్క్ లేకుండా వైట్ కలర్ బ్యాక్ రౌండ్, అభ్యర్థి చెవులతో సహా కనిపించేలా ఉండాలి.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..