హైదరాబాద్ బీటెక్ లో కొత్త కోర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ మెంట్

దేశంలోనే ఫస్ట్ టైమ్
ఐఐటీలో ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్స్
వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాల్లో పెనుమార్పులు
హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ అనేది మనిషి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ఫ్లవర్స్, లీవ్స్ ఇలా ప్రతీది ఆర్టిఫిషయల్ గా మారిపోతున్న క్రమంలో ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మానవ జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మార్పులు వచ్చిన క్రమంలో విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సు రానుంది. ఎడ్యుకేషన్ ద్వారా వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాల్లో పెనుమార్పులు సాధ్యమవుతాయి.
ఇప్పటికే చాలా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్’ బీటెక్‌లో పూర్తిస్థాయి కృత్రిమ మేధ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది. జేఈఈ-అడ్వాన్స్డ్ ద్వారా ఏటా 20 మందికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 2019-2020 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ, హైదరాబాద్ కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలకు చక్కటి వాతావరణాన్ని సృష్టించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యమని ఐఐటీహెచ్ సంచాలకులు ఆచార్య యూబీ దేశాయ్ తెలిపారు.
జాబ్స్ లో స్థిరపడిన వారికోసం ఐఐటీ హైదరాబాద్ ఎంటెక్‌లో డాటా సైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ భాగంగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లిబరల్ ఆర్ట్స్ విభాగాలు సంయుక్తంగా ‘ఏఐ-హ్యుమానిటీస్’ కోర్సును అందుబాటులోకి తెచ్చాయి. బీటెక్ విద్యార్థులు మైనర్ కోర్సుగా దీన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ ఐఐటీతో పాటు ఢిల్లీ ఇంద్రప్రస్థ ట్రిపుల్ ఐటీలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోర్స్
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ట్రిపుల్ ఐటీలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను 2019 ఎడ్యుకేషన్ ఇయర్ నుండి ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించుకున్న క్రమంలోనే బీటెక్‌లో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధ కోర్సును తీసుకొస్తున్న ఐఐటీ హైదరాబాద్ ఈ విషయంలో దేశంలోనే తొలి ఇన్‌స్టిట్యూట్‌గా నిలవనుంది.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికాలోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లు మాత్రమే ఇలా కోర్సును అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ కోర్సును అందించనున్న మూడో ఇన్‌స్టిట్యూట్‌గా హైదరాబాద్ ఐఐటీ ప్రత్యేకత సాధించనుంది.
స్టూడెంట్స్ లో స్కిల్స్ ను డెవలప్ చేయటం టార్గెట్
ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ఎంట్రీ తీసుకునే స్టూడెంట్స్ లో స్కిల్స్ డెవలప్ చేయటమే లక్ష్యంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు కోఆర్టినేషన్ తో వర్క్ చేయనున్నాయి. అల్గారిథమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి పలు సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ కు నేర్పించనున్నారు. ‘మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుంది. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ అంశాల్లోని ప్రాథమిక సూత్రాలపై శిక్షణ అందించనున్నాం. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించే సమయంలో ఎదురయ్యే నైతిక విలువల అంశాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తాం’ అని ఐఐటీహెచ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ సుమోహన చన్నప్పయ్య వివరించారు.