NHAI Recruitment: బంపర్ ఆఫర్.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. రూ.2 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

NHAI Recruitment: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 30 డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

NHAI Recruitment: బంపర్ ఆఫర్.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. రూ.2 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

NHAI issued notification for Deputy General Manager posts

Updated On : July 8, 2025 / 4:56 PM IST

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో 30 డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులను జులై 23లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈమేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత అనుభవం:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూకినివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ రంగంలో 6 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వేతన వివరాలు:

డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టుకి ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 12 కింద నెలకు రూ.78800 నుండి రూ.2,09,200 వరకు జీతం అందుతుంది.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక సైట్ https://nhai.gov.in/#/ లోకి వెళ్ళాలి.
  • హోమ్‌పేజీలోని రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌ లోకి వెళ్ళాలి.
  • ఉద్యోగ సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి
  • తరువాత అభ్యర్థి తన పర్సనల్ డీటెయిల్స్ తో రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఇపుడు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • నింపిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ లేదా ప్రింటవుట్ తీసుకోవాలి.