NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 06:01 AM IST
NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

Updated On : March 18, 2020 / 6:01 AM IST

భారత ప్రభుత్వానికి చెందిన నవరత్నసంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 259 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్ – 125
ఎలక్ట్రికల్(EEE) – 65
ఎలక్ట్రికల్(ECE) – 10
సివిల్ – 5
కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్  – 15
కంప్యూటర్ – 5
మైనింగ్ – 5
జియాలజీ – 5
ఫైనాన్స్ – 14
హ్యూమన్ రిసోర్స్ – 10

విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, లా, సీఏ, సీఎంఏ, ఎంటెక్, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు మార్చి 1, 2020 నాటికి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : కంప్యూటర్ బేస్ టెస్టు, ఇంటర్వూ ద్వారా అభ్యర్దులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ.854 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీస్ మెన్ అభ్యర్దులు రూ.354 చెల్లించాలి.
 
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 18, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 17, 2020.
పరీక్ష తేదీ : మే 26, 2020 నుంచి మే 27, 2020.

Also Read | నా బర్త్‌డే సెలబ్రేట్ చేయద్దు: రామ్ చరణ్