Navodaya Exam: విద్యార్థులకు అలర్ట్.. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి.

బనవాసి జవహర్ నవోదయ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.

Navodaya Exam: విద్యార్థులకు అలర్ట్.. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి.

Navodaya Exam

Updated On : June 10, 2025 / 11:49 AM IST

ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎమ్మిగనూరు సమీపంలో ఉన్న బనవాసి జవహర్ నవోదయ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి అధికారిక ప్రకటన చేశారు. ప్రతి ఏటా 6వ తరగతిలో 80 సీట్లను భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రతి ఏటా దాదాపౌ 6000 మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందిస్తారు.

విద్యార్థుల ఎంపిక విధానంలో కూడా 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25% సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. జవహర్ నవోదయ పాఠశాలలో ప్రేవేశం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3, 4, 5 తరగతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన విద్యార్థులై ఉండాలి. 1-5-2014 నుంచి 31-7-2016 మధ్య జన్మించిన వారై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ 29-07-2025వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు https:/// cseitems.rcil.gov.in/nvs వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం 13-12-2025వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాసైన విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది.