Prasar Bharati Recruitment : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లేదంటే డిగ్రీ ఉత్తీర్ణులై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

Prasar Bharati Recruitment : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ

Recruitment in Prasar Bharat

Updated On : July 29, 2023 / 4:30 PM IST

Prasar Bharati Recruitment : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆకాశవాణిలో 18 జిల్లాల్లో పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్ల (PTC) నియామం చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Chiranjeevi tallest cutout : రాజుగారి తోటలో భోళా శంకర్ భారీ కటౌట్.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాలెస్ట్ ఇదే..

తెలంగాణలో ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల్, నిర్మల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌/హనుమకొండ, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లేదంటే డిగ్రీ ఉత్తీర్ణులై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

READ ALSO : RITES Recruitment : రైల్ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌లో ఖాళీల భర్తీ

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్ధులు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (E) ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాదు 500004 చిరునామాకు పంపాలి. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 31 జులై, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.newsonair.gov.in/ పరిశీలించగలరు.
.