Bank Jobs : ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబెషనరీ, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ

బ్యాంకుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా 224, కెనరా బ్యాంక్ 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 125 ఇలా ఇతర బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.

Bank Jobs : ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబెషనరీ, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ

IBPS PO Notification

Updated On : August 12, 2023 / 12:13 PM IST

Bank Jobs : దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,049 ప్రొబిషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక పక్రియ మొత్తాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ చేపట్టనుంది.

READ ALSO : YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు

బ్యాంకుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా 224, కెనరా బ్యాంక్ 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 125 ఇలా ఇతర బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : AP SI Physical Events : ఎస్ ఐ ఉద్యోగాలకు ఆగస్టు 25 నుండి ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

READ ALSO : Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు ఆగస్టు 21 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; ibps.in పరిశీలించగలరు.