Cochin Shipyard Recruitment : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, వి హెచ్ ఎస్ సి, ఐటిఐ – ఎన్ టి సి సంబంధిత ట్రేడ్ లో పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విదానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Cochin Shipyard Recruitment : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Recruitment of Apprentice Posts in Cochin Shipyard Limited

Updated On : October 14, 2022 / 12:55 PM IST

Cochin Shipyard Recruitment : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్)లో భారీగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 356 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ (348), టెక్నీషియన్ అప్రెంటిస్ (8) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, వి హెచ్ ఎస్ సి, ఐటిఐ – ఎన్ టి సి సంబంధిత ట్రేడ్ లో పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విదానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు చివరితే 26 అక్టోబర్ 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cochinshipyard.in/ పరిశీలించగలరు.