HPCL Recruitment :హెపీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్‌లో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ

HPCL Biofuels Limited Recruitment 2022
HPCL Recruitment : హెపీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 డీజీఎమ్, మేనేజర్, మెకానికల్ ఇంజనీరింగ్, సీనియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. షుగర్ ఇంజనీరింగ్, ఇథనాల్, షుగర్ ప్రొడక్షన్, కో-జెన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టును బట్టి పదో తరగతి/బీఎస్సీ/బయోటిక్నాలజీ/కెమికల్ ఇంజనీరింగ్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/లో బీటెక్, ఎన్విరాన్‌మెంట్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్/బీకాం/సీఏ/హెచ్‌ఎస్సీ/ఇంజనీరింగ్ డిప్లొమా/ఐటీఐ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.
మేనేజ్‌మెంట్ పోస్టులను స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా, నాన్ మేనేజ్‌మెంట్ పోస్టులను షార్ట్‌లిస్టింగ్, స్కిల్ టెస్ట్, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి ఏడాదికి రూ.2.23 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ ; హెప్స్లా బయోఫుల్ లిమిటెడ్., హౌస్ నెం.9, శ్రీ సదన్. – పాట్లీపుత్ర కాలనీ, పాట్నా – 800013. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hpclbiofuels.co.in/home.php పరిశీలించగలరు.