Intelligence Bureau Recruitment : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Intelligence Bureau Recruitment : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Intelligence Bureau

Updated On : October 13, 2023 / 11:41 AM IST

Intelligence Bureau Recruitment : కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ ఇంటిలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 677 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Posts in Indian Navy : ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO : Evening Workout : సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎంపికైన అభ్యర్ధులకు అందించే వేతనం విషయానికి వస్తే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్ పోర్టు పోస్టుకు నెలకు రూ. 21,700 నుండి రూ. 69100 చెల్లిస్తారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అభ్యర్ధులకు నెలకు వేతనంగా రూ 18000 నుండి రూ.56900 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా నవంబర్ 13 , 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; mha.gov.in పరిశీలించగలరు.