Posts in Indian Navy : ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

Posts in Indian Navy : ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ పోస్టుల భర్తీ

Posts in Indian Navy

Posts in Indian Navy : ఇండియన్ నేవీ లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 224 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Diet For Dengue : డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

ఖాళీల వివరాలకు సంబంధించి జనరల్ సర్వీస్ హైడ్రో క్యాడర్: 40 పోస్ట్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 8 పోస్టులు, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (పూర్వ పరిశీలకుడు): 18 పోస్టులు, పైలట్: 20 పోస్టులు, లాజిస్టిక్స్: 20 పోస్టులు, విద్యార్హత: 18 పోస్టులు, ఇంజనీరింగ్ బ్రాంచ్ {జనరల్ సర్వీస్ (GS)}: 30 పోస్ట్‌లు, ఎలక్ట్రికల్ బ్రాంచ్ {జనరల్ సర్వీస్ (GS)}: 50 పోస్ట్‌లు, నేవల్ కన్‌స్ట్రక్టర్: 20 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Evening Workout : సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.

READ ALSO : Assembly Elections 2023: బీజేపీ నేతలను టార్గెట్ చేసిన నక్సలైట్లు.. 24 మంది అభ్యర్థులకు ఎక్స్ కేటగిరీ భద్రత

ఎంపికైన అభ్యర్థులు సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమితులవుతారు. వారికి నెలకు రూ.56,100 బేసిక్ వేతనంతోపాటుగా పలు రకాల అలవెన్సులు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 29 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; joinindianavy.gov.in పరిశీలించగలరు.