Indian Navy Recruitment : ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మేన్ పోస్టుల భర్తీ

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్​ ఎంపిక​ ఉంటుంది. ఎంపికైనవారికి రూ.18,000 బేసిక్​ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు  వేతనం అందుతుంది.

Indian Navy Recruitment : ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మేన్ పోస్టుల భర్తీ

Indian Navy

Updated On : September 2, 2023 / 7:41 PM IST

Indian Navy Recruitment : ఇండియన్​ నేవీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.  కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్, వైర్‌మ్యాన్, టైలర్. తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ​

READ ALSO : Some beliefs : ఈ వస్తువుల్ని చేతికి ఎందుకు ఇవ్వకూడదంటారో మీకు తెలుసా?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదోతరగతితోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 52 ట్రేడుల్లో ఎందులోనైనా ఏడాది లేదా రెండేళ్ల కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తు  చేసుకోవచ్చు. వయసు 18 నుంచి -25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తుంది.

​READ ALSO : Boost Immunity : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలు

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్​ ఎంపిక​ ఉంటుంది. ఎంపికైనవారికి రూ.18,000 బేసిక్​ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు  వేతనం అందుతుంది. ఎంపికైనవారు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ కమాండ్‌లో విధులు నిర్వర్తించాలి.

​READ ALSO : Strange Disease : ఈ వింతవ్యాధి సోకితే డ్యాన్స్ చేస్తునే ఉంటారట..! డ్యాన్స్ చేస్తునే చనిపోతారట..!!

దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25  ఆఖరు తేదిగా నిర్ణయించారు. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.karmic.andaman.gov.in వెబ్​సైట్ పరిశీలించగలరు.