Boost Immunity : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలు

వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు చుట్టుముడుతుంటాయి. దానికోసం మందులు మింగేబదులుమనకు దొరికే కూరగాయలతోనే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవడం వల్ల, ఇతర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతుంటాం.

Boost Immunity : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలు

Monsoon superfoods

‌Boost Immunity : చిటపట చినుకులు పడుతూ ఉంటే హాయిగా ఉంటుంది. కానీ ఆ చినుకులతో పాటు అనేక రోగాలు చుట్టుముడతాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఈ కూరగాయలను మీ మాన్ సూన్ డైట్ లో చేర్చండి.

వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు చుట్టుముడుతుంటాయి. దానికోసం మందులు మింగేబదులుమనకు దొరికే కూరగాయలతోనే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవడం వల్ల, ఇతర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతుంటాం. మనలో రోగనిరోధక వ్యవస్థ పెంపొందాలంటే ఈ కాలంలో విటమిన్ సి, జింక్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మరి ఆ కూరగాయలేంటో ఇక్కడ తెలుసుకోండి.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

బచ్చలికూర :

ఈ ఆకుకూర మనకు పవర్ హౌస్ లా పని చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలుంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరమైన కణాల పనితీరును పెంచడానికి ఉపయోగపడుతాయి. అందులో సలాడ్స్, సూప్స్ ల్లో వీటిని ఈ కాలంలో తప్పక చేర్చండి.

రెడ్ క్యాప్సికం :

ఇది చూడడానికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు.. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. విటమిన్ సి నిండిన ఈ కూరగాయ చర్మాన్ని కాపాడడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనీయదు. క్యాప్సికంలోయాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షిస్తాయి.

READ ALSO : Benefits of Eating Ghee : వర్షకాలంలో జీర్ణక్రియను మెరుగు పరచటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే నెయ్యి !

బ్రోకలీ :

విటమిన్లు, ఖనిజన్లే కాదు.. ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉండే కూరగాయ బ్రోకలీ. విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఇందులో ఉన్నాయి. వీటిలో లభించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం రోగనిరోధకతను పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది. కాబట్టి మాన్ సూన్ లో దీన్ని అలాగే తీసుకోవడమో లేక సూప్, సలాడ్ లో చేర్చితే మరింత టేస్టీగా ఉంటుంది.

క్యారెట్స్ :

కాలం ఏదైనా సరే ఎప్పటికీ ఉండాల్సిన కూరగాయ దీన్ని చెప్పొచ్చు. దీన్ని కూరలాగకంటే కూడా అలాగే తీసుకుంటే ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. క్యారెట్స్ల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్స్ ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకుఉపయోగపడుతాయి. అంతేకాదు.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి.

READ ALSO : Swine Flu During Rainy Season : వర్షకాలంలో స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

కాకరకాయ :

కాకరకాయలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం ఉంటుంది. అయితే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాదు.. కడుపులో మంటను తగ్గిస్తుంది.

బెండకాయ :

విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయ బెండకాయ. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణం కూడా త్వరగా అవుతుంది. దీన్ని సూప్, కూరలా చేసుకుంటే మీకు కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !

ఈ కూరగాయలనే కాకుండా.. వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి, దీంతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా అవసరం. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి.