South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ల భర్తీ
విద్యార్హత విషయానికి వస్తే అభ్యర్ధులు కనీసం ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. కనీసం 50శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణుత కలిగి ఉండాలి. వయస్సు

Scr Zone
South Central Railway : సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. యాక్ట్ అప్రెంటీస్ గా పిలవబడే ఈ పోస్టులకు సంబంధించి ఖాళీలను విభాగాల వారిగా పరిశీలిస్తే ఏసీ మెకానిక్ 250, కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రిషియన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ 71, ఎంఎంటీఎం 5, ఎంఎండబ్ల్యూ 24, పెయింటర్ 80, వెల్డర్ 553 అప్పెంటీస్ ల ఖాళీలనుభర్తీ చేయనున్నారు.
విద్యార్హత విషయానికి వస్తే అభ్యర్ధులు కనీసం ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. కనీసం 50శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణుత కలిగి ఉండాలి. వయస్సు 2021 అక్టోబరు 04 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎంపికకు సంబంధించి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజును ఇతరులకు 100రూపాయలు గాను, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేదిగా నవంబరు 3 ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ scr.indianrailways.gov.in