NTPC JOBS : ఎన్ టీ పీసి లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NTPC JOBS : ఎన్ టీ పీసి లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Ntpc Jobs

Updated On : April 27, 2022 / 10:49 AM IST

NTPC JOBS : నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్ టీపీసీ) లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 15 ఎగ్జిక్యూటీవ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే సోలార్ పీవీ 5 ఖాళీలు, డేటా అనలిస్ట్ 1 ఖాళీ, ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ 9ఖాళీలు భర్తీ చేయనున్న పోస్టుల్లో ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 29,2022 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమౌతుంది. దరఖాస్తు గడువు మే 13,2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.ntpc.co.in/ సంప్రదించగలరు.